హైదరాబాద్: ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చాను సోమవారం మణిపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యాక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని.. ఆ బాధ్యత మనందరిపైన ఉందని మీరా అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన మీరాబాయిని ఈ సందర్భంగాMirabai Chanu ,Plant Saplings, Manipur latest news ,Tokyo Olympics, MP Santosh Kumar, Green India Challenge ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందించారు. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేసిన మీరా, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచిందని ఎంపి సంతోష్ కుమార్ అన్నారు.
Impressive work from the champion. Congratulation on winning the silver. We are proud of you. Now, you steal our hearts by showing your concern for the nature. No wonder a person from Manipur doing this. But it certainly inspires many to replicate. #GreenIndiaChallenge 🌱 https://t.co/qNuUajD4ux
— Santosh Kumar J (@MPsantoshtrs) August 2, 2021
Mirabai Chanu Plant Saplings in Manipur