ప్రముఖ పర్యాటక ప్రాంతంగా బ్రిడ్జిని తీర్చిదిద్దాలి 90 రోజుల్లో
బ్రిడ్జి డిపిఆర్‌ను సిద్ధం చేయాలి గ్రేటర్ పరిధిలో చేపట్టిన
అభివృద్ధి పనులపై అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జిని తీ ర్చిదిద్దాలి. 90 రోజుల్లో మీరాలం చెరువు పై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించిన డిపిఆర్‌ను పూర్తి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆ దేశించారు. 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూ ర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. మీరాలం చెరువుపై నిర్మిస్తు న్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు ము ఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీ హెచ్‌ఎంసీకి సం బంధించి గ్రేటర్ పరిధి లో చేపట్టిన అభివృద్ధి పనులపై సిఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చి న్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని మీరాలం బ్రిడ్జి పరిసరాలను ఆహ్లాదకరంగా రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నిర్మాణంలో భాగంగా 2.425 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు మూ డు ప్రతిపాదనల ను చేశారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కొ త్త ప్లై ఓవర్లపై మరింత లోతుగా అధ్యయ నం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. రోడ్ల వెడల్పుకు సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం జరిగిన సమీక్షకు సంబంధించి రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో రా వాలని సిఎం సూచించారు.ఈ సమీక్షలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ము న్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.