- Advertisement -
శ్రీ సత్యసాయి ఆర్ట్‌పై నిర్మాత కెకె రాధామోహన్ తమ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా మిర్నా మీనన్ ఎంపికైంది. గతంలో మలయాళం, తమిళంలో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్‌లు ఇద్దరికీ తగినప్రాధాన్యత ఉంటుంది.
- Advertisement -