Monday, December 23, 2024

నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది

- Advertisement -
- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

కొత్తవాడైతే దానికి సహజత్వం…
కొత్తవాళ్లతోనే వర్క్ అవుట్ అయ్యే కథ ఇది. ఈ కథకు ఒక సామాన్యుడు కావాలి. కొత్తవాడైతే దానికి సహజత్వం వస్తుంది. పెదకాపు1సినిమాపై మంచి అంచనాలు రావడం ఆనందంగా వుంది. పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతోనే మొదటి నుంచి ఈ సినిమాను పెద్దగానే చేశాం.
సామాన్యుడు ఇంత పోరాటం చేయాలా…
ప్రతి కథలో బలవంతుడు, బలహీనుడు మధ్య పోరాటం వుంటుంది. ఈ కథ తెరపై చూస్తున్నపుడు ఒక సినిమాలా కాకుండా నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. దర్శకుడు శ్రీకాంత్ రాసిన మాటలు గుచ్చుకుంటాయి. సినిమా చూస్తున్నపుడు జీవితంలో నెగ్గాలంటే ఒక సామాన్యుడు ఇంత పోరాటం చేయాలా అనిపిస్తుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నప్పుడు నిజమే కదా.. మనం ఎందుకు పోరాటం చేయకూడదనిపిస్తుంది.

ఒక చరిత్రని కళ్ళ ముందు…
సినిమా అంత చాలా సహజత్వంతో వుంటుంది. ఎక్కడ కృత్రిమంగా సెట్స్ వేయలేదు. వందశాతం నిజాయితీగా తీశాం. ఒక చరిత్రని కళ్ళ ముందు ఎలా చూపించాలో అలానే చూపించాం. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబించేలా అన్ని రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. రాజమండ్రి నుంచి ప్రతి రోజు రెండుగంటల పాటు జర్నీ చేసిమరీ కొన్ని సహజమైన లోకేషన్స్ లో షూట్ చేశాం.
అలా ఈ కథకు పెదకాపు టైటిల్…
మొదట సినిమాకి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. ఇది కర్ణ పాత్ర చేసే పోరాటం కదా.. కర్ణ టైటిల్ అయితే ఎలా వుంటుందని చర్చించాం. ఇలాంటి సమయంలో దర్శకుడు శ్రీకాంత్ లోకేషన్స్ చూడటానికి వెళ్ళినపుడు ‘పెదకాపు’ అనే పేరుని చూశారు. దాని గురించి అక్కడి వాళ్ళని అడిగితే… ఆ వూరికి మంచి చేసిన వ్యక్తని చెప్పారు. అప్పుడు శ్రీకాంత్ మన కథ కూడా ఇదే… పెదకాపు పేరు బావుంటుందని అన్నారు. అలా ఈ కథకు పెదకాపు అనే పేరుపెట్టాం.

విరాట్ సరిగ్గా సరిపోయాడు…
విరాట్‌కి సినిమాలపై ఆసక్తి వుంది. తను హీరో మెటీరియల్. స్క్రీన్ పై చూస్తున్నపుడు ఒక పెద్ద హీరోని చూసిన అనుభూతి కలిగింది. చాలా ఇంటెన్స్ వున్న యాక్షన్ సినిమా ఇది. దీనికి ఒక సామన్యుడు హీరో కావాలి. దీనికి విరాట్ సరిగ్గా సరిపోయాడు. మేము ఈ కథని బలంగా నమ్మాం.
నెక్స్ ప్రాజెక్ట్…
ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పెదకాపు2’ ఉంటుంది. అడివి శేష్‌తో ఒక సినిమా వుంటుంది. అలాగే మరో రెండు, మూడు కథలు చర్చల్లో వున్నాయి. అదేవిధంగా ‘అఖండ 2’ కూడా ఖచ్చితంగా చేస్తాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News