హైదరాబాద్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారో అని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాలకు చాలామంది విద్యార్థులు కన్సల్టెన్సీల ద్వారా వెళ్తుంటారు. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన యువకుడు అజయ్ (మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్(అమృత భర్త) సొంత తమ్ముడు) వైద్య విద్యనభ్యసించడానికి రష్యా వెళ్ళాడు. మరో మూడు నెలల్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని స్వస్థలం మిర్యాలగూడకు రావాల్సి ఉంది. యుద్ధం మొదలు కావడంతో అక్కడే చిక్కుకున్నాడు. గురువారం రష్యా నుండి తిరిగి ఇండియా రావడానికి సిద్ధం కాగా.. ఆకస్మికంగా రష్యా ప్రభుత్వం విమానాలను నిలిపివేయడంతో అజయ్ అక్కడే చిక్కుకుపోఆడని అతడి తండ్రి పెరుమాల్ల బాలస్వామి చెప్పారు. దీంతో మిర్యాలగూడలో ఆయన కటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని వేలాదిగా ఉన్న విద్యార్థులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రష్యాలో చిక్కుకున్న మిర్యాలగూడ స్టూడెంట్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -