Sunday, December 22, 2024

ఆమెరికా రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ యువకుడు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మిర్యాలగూడ: ఆమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాసి సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి (25) మృతి చెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం బి. అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ దంపతుల ద్వితీయ కుమారుడైన క్రాంతి కిరణ్ రెడ్డి తన స్నేహితులతో కలిసి ఆమెరికాలోని మిజోరిలో ప్రయాణిస్తుండగా వీరి కారును ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో క్రాంతి కిరణ్ రెడ్డ్డి తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌లో బిటెక్ పూర్తిచేసి 2021జులై 23న ఆమెరికా వెళ్లి మిజోరి సెంటర్ యూనివర్సిటిలో ఎంఎస్ చేస్తున్నాడు. క్రాంతికిరణ్ రెడ్డి మరణ వార్త తెలియడంతో మృతుడి స్వగ్రామమైన మిర్యాలగూడ మండలం అన్నారంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News