Thursday, January 23, 2025

నిధుల దుర్వినియోగం.. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -
  • అనుమతి లేకుండా అక్రమంగా ఎస్‌బిఎం డబ్బులు డ్రా
  • అధికారుల విచారణతో బట్టబయలైన కార్యదర్శి బాగోతం
  • సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ నారాయణరెడ్డి

పెద్దేముల్: స్వచ్ఛ భారత్ మిషన్ డబ్బుల దుర్వినియోగానికి పాల్పడిన పంచాయితీ కార్యదర్శి ఖమ్రుద్దీన్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు అదివారం సస్పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి.

పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామానికి మే 15, 2022 నాడు ఖమ్రుద్ధీన్ పంచాయితీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి గత కొంతకాలం వరకు సక్రమంగానే విధులు నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే గ్రామానికి సంబంధించిన వ్యక్తిగత మరుగుదొడ్ల డబ్బుల నిల్వకోసం గతంలోనే తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో వీడబ్లూఎస్ (విలేజ్ వాటర్ అండ్ శ్యానిషన్ కమిటీ) పేరిట 79039484457 అనే ఖాతాను ఓపెన్ చేశారు. గ్రామానికి సంబంధించిన మరుగుదొడ్ల డబ్బులు ఇదే ఖాతాలో ఉన్నాయి.

ఇది గమనించిన పంచాయితీ కార్యదర్శి ఎస్‌బీఎం డబ్బులపై కన్నేశాడు. ఎవరి అనుమతి లేకుండానే 16/09/2022 నా డు రూ.3.40 లక్షలు (చెక్ నం.797288), 19/09/ 2022 నాడు రూ.80 వేలు (చెక్ నం.797 289), 25/10/2022 నాడు రూ.3 లక్షలు (చెక్ నం.797300), 08/12/2022 నాడు రూ.2లక్షలు (చెక్ నం.797299), 08/12/ 2022 నాడు రూ.లక్ష (చెక్ నం.797291) చొప్పున డబ్బులను విత్ డ్రా చేశాడు. అయితే డబ్బులు డ్రా చేసిన చెక్కులపై అప్పటి గ్రామసంఘం అధ్యక్షురాలు వినోద, సర్పంచ్ శ్రావణ్ కుమార్‌లు ఎలాంటి సంతకాలు చేయలేదు. అయితే వారి అనుమతి లేకుండానే దొంగ సంతకాలతో రూ.10.20 లక్షలు కాజేశాడు.

ఇదే విషయంపై ఫోర్జరీ సంతకాలు చేశారని సర్పంచ్ శ్రావణ్, ఇన్చార్జి పంచాయితీ కార్యదర్శి సంజీవ్ కలిసి 26/04/2023 నాడు పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, డీపీఓకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీపీఓ తరుణ్ కుమార్ 29/04/2022 నాడు గ్రామ పంచాయితీలో ప్రాథమిక విచారణ చేశారు. పంచాయితీ కార్యదర్శి డ్రా చేసిన చెక్కులలో గ్రామానికి చెందిన లబ్దిదారులు ఒక్కరు కూడా లేరు.

ఐదు చెక్కులు కూడా పంచాయితీ కార్యదర్శి తన కుటుంబీకురాలి పేరిట డబ్బులు విత్ డ్రా చేశారు. మొత్తానికి వీడబ్లూఎస్ కమిటీ అనుమతి లేకుండానే రూ.10.20 లక్షలు అక్రమంగా కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీని ఆధారంగానే డీపీఓ తరుణ్ కుమార్ ఓ నివేదికను కలెక్టర్‌కు అందించారు. దీంతో పంచాయితీ కార్యదర్శి ఖమ్రుద్ధీన్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News