Monday, December 23, 2024

ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: దశాబ్ధి ఉత్సవాల పేరుతో కెసిఆర్ ప్రభుత్వ నిధులను దిర్వనియోగం చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నలమాద పద్మావతి రెడ్డి ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు గురువారం హుజూర్‌నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో ఇందిరాసెంటర్‌లో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అక్కడి నుండి కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి ఆర్ డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమోరాండంను ఆర్‌డీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పద్మావతి రెడ్డి మాట్లాడుతూ దశాబ్ధి ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని వెచ్చించి బిఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

అందుకు నిరసనగా దశాబ్ధి దగా పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరసన చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, అరుణ్‌కుమార్ ధేశ్‌ముఖ్, గల్లా వెంకటేశ్వర్లు, మంజూనాయక్, కస్తాల శ్రావణ్, తేజావత్ రాజానాయక్,కోల మట్టయ్య, కుక్కడపు మహేష్, కంకణాల పుల్లయ్య, చింతకాయల రాము, బెల్లంకొండ గురవయ్య, కోలపూడి యోహన్, సుదర్శన్, పాలకూరి లాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News