Saturday, December 28, 2024

దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని డిగ్రీ కాలేజి ఉర్దూ మీడియం, 30 పడకల ఆసుపత్రి ఊసే లేదన్నారు.

పట్టణ కేంద్రంలోని గర్ల్ హై స్కూల్ 350 మంది స్టూడెంట్స్ వా రికి సరైన వసతి లేక సరైన భవనం, టాయిలెట్స్ లేక శిథిలావస్థకు చేరుకుంటే దాంట్లో పాఠాలు బోధిస్తున్న టీచర్లు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారన్నారు. స్క్రీన్లు పెట్టి అభివృద్ధి పనులు చేశామంటూ ప్రకటనలు ఇవ్వడం సరికాదని, ఎక్కడ అభివృద్ధి చేశారో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ యన విమర్శించారు. పట్టణానికి సంబంధించిన సమస్యలను వినతిపత్రంతో వనపర్తి జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సి సెల్ ఉపాధ్యక్షులు పి. ప్రశాంత్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, బోయేజ్, కౌన్సిలర్ చీర్ల నాగన్న సాగర్, మాజీ సర్పంచ్ ధన్వాడ బాలస్వామి, సలీం ఖాన్, మేస్త్రీ శ్రీనివాసులు, డైరెక్టర్ రామ్ లాల్ నాయక్, సాయన్న గౌడ్, ముస్తఫా, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News