Sunday, January 19, 2025

ఝార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఝార్ఖండ్ రాష్ట్రం సాహిబ్‌గంజ్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై బాంబులు పెట్టి పేల్చారు. ట్రాక్‌పై గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాలు అమర్చి పేల్చడంతో 40 మీటర్ల దూరంలో ట్రాక్ ఎగిరిపడింది. పేలుడు ధాటికి రైల్వే ట్రాక్‌పై మూడు అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. గోడ్డాలోని లాల్‌మాటియా నుంచి పశ్చిమ బెంగల్ ఫరక్కాలోని పవర్ స్టేషన్‌కు బొగ్గును రవాణా చేసేందుకు ఈ ట్రాక్‌ను ఉపయోగిస్తున్నట్టు ఎన్‌టిపిసి వెల్లడించింది. బొగ్గు రవాణాకు ఈ ట్రాక్‌ను ఉపయోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ట్రాక్ ఇండియన్ రైల్వే విభాగం కిందకు రాదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News