Monday, January 20, 2025

ఆఫీస్ నుంచి బయటకు రాగానే మహిళను కత్తితో పొడిచి…

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఫైనాన్స్ కంపెనీలో పని చేసే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి అనంతరం కర్రతో దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయిన సంఘటన ఒడిశా రాష్ట్రం డియోగఢ్ జిల్లా ప్రధాన్‌పట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంబాల్‌పూర్ జిల్లా కుచిందా ప్రాంతానికి చెందిన రీతా సాహూ అనే మహిళా డియోగఢ్ జిల్లాలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆఫీసులో విధులు ముగించుకొని బయటకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కత్తితో పొడిచారు. అనంతరం ఆమె తలపై కర్రతో బాదాడంతో స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News