Wednesday, January 22, 2025

ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌లో మిస్ ఫైర్..అపార్ట్‌మెంట్‌లోకి దూసుకెళ్లిన తూటా

- Advertisement -
- Advertisement -

అపార్ట్‌మెంట్ ఐదో అంతస్థులోని బెడ్రూంలోకి బుల్లెట్ దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడి నుంచి బుల్లెట్ దూసుకుని వచిందో తెలియక ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగీగూడలో శనివారం చోటుచేసుకుంది. బుల్లెట్ వేగానికి కిటికీ అద్దం పగిలిపోయిది, ఈ సమయంలో బెడ్‌రూంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్క్ అద్వైత్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులోకి బెడ్‌రూమ్‌లోకి బుల్లెట్ దూసుకుని రావడంతో బెడ్‌రూం అద్దాలు ధ్వంసం అయ్యాయి.

వెంటనే ఇంటి యజమాని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బెడ్‌రూంలో పడి ఉన్న బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్‌లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీని వల్ల బుల్లెట్ ఆర్క్ అద్వైత అపార్ట్‌మెంట్ ఐతో అంతస్తులోని బెడ్‌రూములోకి దూసుకెళ్లినట్లు పోలీసులు నిర్దారించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News