Wednesday, January 15, 2025

మిస్ అమెరికా చెస్లీ అనుమానాదస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Miss america 2019 Cheslie Kryst

వాషింగ్టన్: మిస్ అమెరికా-2019 చెస్లీ క్రిస్ట్(30) అనుమానాదస్పద స్థితిలో మృతిచెందారు. బ్యూటీ క్వీన్, లాయర్, ఫ్యాషన్ బ్లాగర్, ఎక్స్‌ట్రా టీవీ కరస్పాండెంట్ అయిన చెస్లీ ఆదివారం ఉదయం 7 గంటల తర్వాత న్యూయార్క్ నగరంలోని తాను ఉంటున్న అపార్ట్ మెంట్ 60-అంతస్తు ఎత్తు నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. సంఘటన స్థలంలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.చెస్లీ మృతిపట్ల మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. ఆమె మరణ వార్త విని తన హృదయం ముక్కలైందంటూ చెస్లీతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పంచుకున్న హర్నాజ్ ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021లో విజయం సాధించిన తర్వాత చెస్లీతో చిరునవ్వులు పంచుకోవడం ఈ ఫోటోలో చూడవచ్చు. 1991లో మిషిగాన్ జాక్సన్ లో పుట్టిన చెస్లీ.. 2019లో మిస్ అమెరికా టైటిల్ గెలుచుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News