Sunday, December 22, 2024

మనం అందరం భూమి బిడ్డలమే..

- Advertisement -
- Advertisement -

Miss India Manasa Varanasi plants sapling at Indira Park

కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ.. మనం అందరం భూమి బిడ్డలమే అని, మొక్కలు నాటి పర్యావరణ బాధ్యత తీర్చటం మనపైన ఉందన్నారు. అందాల పోటీల్లో పాల్గొంటున్న తాను ఈ మెసేజ్‌ను వీలైనంత వరకు ప్రచారం చేస్తానని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. తన వంతుగా మొక్కలు నాటానని, అనంతరం తన స్నేహితులు శిల్పారెడ్డి, అర్చన, రాజ్ ముగ్గురికి మానస వారణాసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News