వాషింగ్టన్: మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో సుందరి ఆండ్రియా మేజా దక్కించుకున్నారు. ప్రపంచంలోని అందగత్తెలు 73 మందిని వెనక్కునెట్టి ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు. మిస్ ఇండియా అడ్లైస్ కాస్టెలినో ఈ టైటిల్‌కు కొద్ది దూరంలో ఆగిపోయారు. దీంతో ఆమె ప్రపంచం నలుమూలల నుంచి ఈ పోటీకి హాజరైన 73 మంది సుందరీమణులను వెనక్కు నెట్టి 69 వ మిస్ యూనివర్స్‌గా గెలుపొందారు. ఫ్లోరిడా లోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్‌లో ఆదివారం జరిగిన ఈ 69 వ మిస్ యూనివర్స్ షో కార్యక్రమంలో ఆండ్రియా మెజాకి దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ విశ్వసుందరి జోజిబిని తుంజీ కిరీటాన్ని ధరింప చేశారు. ఈ పోటీలో రెండవ రన్నరప్‌గా మిస్ పెరూ జెనిక్ మాచెట్టా నిలిచారు. మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని గెలుచుకున్న ఆండ్రియా మేజా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు.
ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచారు. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుందని, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దంటూ తుది దశలో ఆమె చెప్పిన సమాధానం న్యాయ నిర్ణేతలను మెప్పించింది. ఆండ్రియా లింగ సమానత కోసం కూడా కృషి చేస్తున్నారు. కరోనా కారణంగా విశ్వసుందరి పోటీలను గత ఏడాది నిర్వహించలేదు. మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అడిలైన్ క్యాస్టిలినో మూడో రన్నర్‌గా నిలిచారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇదే వేదికపై మయన్మార్ నుంచి పాల్గొన్న భుజార్ వింట్ ల్విన్ తన దేశంలో సైన్యం సాగిస్తున్న అరాచకాలపై ఆందోళన వెలిబుచ్చారు. సైన్యం చేతిలోమయన్మార్ ప్రజలు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారని, మయన్మార్ ప్రజలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
Miss Mexico Andrea Meza wins Miss Universe 2020