Saturday, December 21, 2024

‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ టీజర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

యంగ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’. ‘జాతి రత్నాలు’ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నవీన్ పొలిశెట్టి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. దీంతో తన తరువాతి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అనుష్కతో కలిసి చేస్తున్న ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది.

Also Read: రూ.100 కోట్ల క్లబ్ దిశగా ‘విరూపాక్ష’

తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మరోసారి తన కామెడీ టైమింగ్ తో నవీన్ పొలిశెట్టి అలరించాడు. టీజర్ మూవీపై అంచనాలను  మరింత పెంచేసింది. ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News