Thursday, December 26, 2024

మిస్ శెట్టి… ట్రైలర్ కు టైమ్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు.

ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News