ఇజ్రాయెల్ : అందంతోపాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్ (1994), లాలాదత్తా (2000)ల సరసన చేరింది. తన అందంతోపాటు పదునైన సందేశం , తెలివైన సమాధానాలతో అందరినీ అబ్బుర పరిచింది. పంజాబ్ లోని చండీగఢ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సంధు మోడలింగ్, వెండి తెరపై ఆసక్తితో ఆమె విద్యార్థి దశ లోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేశారు. మోడలింగ్‌లో శిక్షణ తీసుకుని మోడల్‌గా ఎన్నో వేదికలపై మెరిశారు. ఈ క్రమం లోనే అందాల పోటీల్లో పాల్గొని లివా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనేక పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. సోషల్ మీడియా లోనూ ఆమెకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. నువ్వు సన్నగా, పీలగా ఉంటావు. మరీ అంత అందగత్తెవేమీ కాదు ఇలాంటి వ్యాఖ్యలతో సందు తనకు ఎదురైన అవమానాలు, విమర్శలను మెట్లుగా మార్చుకొని ఆత్మ విశ్వాసంతో ముందడుగేసి భారత్‌కు 21 సంవత్సరాల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని తీసుకు వచ్చారు. హర్నాజ్ తల్లి ఫేమస్ గైనకాలజిస్ట్ . ప్రతి విషయంలో అమ్మ నుంచే స్ఫూర్తి పొందానని హర్నాజ్ చెబుతుంటారు. మోడలింగ్ కెరీర్ లోకి ప్రవేశించడానికి అమ్మ ప్రోత్సాహమే కారణమని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
హర్జాజ్కు కిరీటం తెచ్చిపెట్టిన ప్రశ్న ఇదే
ఒత్తిళ్లు ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఉన్న యువతకు మీరిచ్చే సలహా ఏమిటి ? అన్న ప్రశ్నకు ఆత్మ విశ్వాసం లేకపోవడమే నేటితరం యువత ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య . మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్లతో పోల్చుకోవడం ఇకనైనా ఆపండి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న ఎన్నో విషయాల గురించి మాట్లాడండి. మీ జీవితానికి మీరే లీడర్. కాబట్టి మీకోసం మీరు గళమెత్తండి. నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే నేను ఈరోజు ఈ వేదికపై ఉన్నాను. ( అని హర్నాజ్ చెప్పడంతో వేదిక వద్ద ఉన్న ప్రేక్షకులందరూ ఒక్కసారిగా చప్పట్లతో అభినందనలు తెలిపారు.)
మరికొన్ని వివరాలు
హర్నాజ్ ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తున్నారు. స్త్రీవిద్య, మహిళా సాధికారతకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. 2014 ఫిబ్రవరి 14 న ఆమె ఇన్‌స్టా లోకి అడుగుపెట్టారు. ట్రావెలింగ్, స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడమంటే ఎంతో ఆసక్తి. ఫిట్నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ , యోగా చేస్తుంటారు. సమయం దొరికినపుడు ప్రియమైన వారికి వంట చేసిపెట్టడమంటే ఇష్టం. డ్యాన్స్‌లో కూడా ఆమె సూపర్.
మిస్ యూనివర్స్‌గా భారతీయ యువతి సంధు
- Advertisement -
- Advertisement -
- Advertisement -