Saturday, November 23, 2024

గుర్రపు స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్!

- Advertisement -
- Advertisement -

లాస్ ఏంజెల్స్: మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియన్నా వీర్(23) ఆస్ట్రేలియాలోని విండర్స్ పోలో గ్రౌండ్స్‌లో గుర్రపు స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించింది. ఈ ఫ్యాషన్ మోడల్ మే 4(గురువారం) కన్నుమూసినట్లు ఏస్‌షోబిజ్ డాట్ కామ్ నివేదించింది. ఆమె మరణించినట్లు ఆమె బాయ్‌ఫ్రెండ్ టామ్ బుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించాడు. ‘మేము ప్రేమాతీతంగా ప్రేమించుకున్నాము’(వీ లవ్డ్ విత్ లవ్ దట్ వాజ్ మోర్ దేన్ లవ్) అని అతడు రాశాడు.

సిడ్నీ యూనివర్శిటీ నుండి ఇంగ్లీష్ సాహిత్యం, సైకాలజీలో డబుల్ డిగ్రీ పొందిన వీర్ ప్రమాదం తర్వాత చాలా వారాలపాటు వెస్ట్‌మీడ్ ఆసుపత్రిలో సపోర్ట్‌పై జీవించారని న్యూస్ డాట్ కామ్ ఆస్ట్రేలియా పేర్కొంది. వీర్ తన మోడలింగ్ వృత్తిని అభివృద్ధి చేసుకోడానికి భవిష్యత్తులో లండన్‌కు మకాము మార్చాలని యోచిస్తూ ప్రమాదానికి గురై మరణించింది.

ఆమె ఏజెన్సీ అయిన స్కూప్ మేనేజ్‌మెంట్ వీర్ అనేక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఆమె ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని పేర్కొంది. 2022లో జరిగిన ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలో 27 మంది ఫైనలిస్టులలో వీర్ ఒకరు. ఫోటోగ్రాఫర్ క్రిస్ డ్వైర్ సైతం సోషల్ మీడియా ద్వారా ఆమెకు నివాళులు అర్పించారు.

మోడల్ అయిన సియన్నా వీర్ తన మూడేళ్ల వయస్సులోనే గుర్రపు స్వారీని ఆరంభించింది. ఆమె దానినో అభిరుచిగా పేర్కొంది. ఆమె గోల్డ్ కోస్ట్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ ‘నా కుటుంబానికి ఈ గుర్రపు స్వారీ అభిరుచి(ప్యాషన్) ఎక్కడి నుంచి అబ్బిందో ఖచ్చితంగా తెలియదు. కానీ నేను మూడేళ్ల వయస్సు నుంచే గుర్రపు స్వారీ చేస్తున్నాను. గుర్రపు స్వారీ లేకుండా నా జీవితాన్ని ఊహించలేను’ అంది.

Miss Universe 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News