ప్యూర్టోరికో: పోలాండ్‌కు చెందిన కరోలినా బైవ్లెస్కా ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకుంది. 70వ ప్రపంచ సుంది పోటీల్లో విజేతగా నిలిచింది. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్‌లోని కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ‘మా మిస్ వరల్డ్ 2021 పోలాండ్‌కు చెందిన కరోలినా బైవ్లెస్కా’ అని మిస్ వరల్డ్ సంస్థ గురువారం ట్వీట్ చేసింది. ఆమె ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. మున్ముందు పిహెచ్‌డి చేయాలనుకుంటోంది. కరోలినా మోడల్‌గా కూడా పనిచేస్తోంది. ఆమెకు ఈత, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం అంటే ఇష్టం. ఇదిలావుండగా మిస్ వరల్డ్ 2021లో అమెరికాకు చెందిన శ్రీసైనీ మొదటి రన్నరప్‌గా నిలువగా, కోట్ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్ రెండో రన్నరప్‌గా నిలిచింది. గమనించాల్సిన విశేషమేమిటంటే శ్రీసైనీ భారతీయ సంతతికి చెందిన అమెరికన్. ఆమె ’బ్యూటీ విత్ పర్పస్‘ కేటగిరి కింద విజేతగా నిలిచింది. 69వ ప్రపంచ సుందరి టోనిఆన్ సింగ్ నుంచి కరోలినా ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందింది. ఆ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ‘ప్రపంచ సుందరిగా నా పేరు విన్నప్పుడు దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మిస్ వరల్డ్ కిరీటం నాకు దక్కడం గౌరవంగా ఉంది. ప్యూర్టోరికోలోని ఈ ఘట్టాన్ని నేను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని కరోలినా తెలిపింది.
మిస్ వరల్డ్ విజేతగా కరోలినా బైవ్లెస్కా
- Advertisement -
- Advertisement -
- Advertisement -