Friday, December 27, 2024

లవ్ ఎంటర్‌టైనర్ సినిమా మిస్ యు

- Advertisement -
- Advertisement -

హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించారు. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సిద్ధార్థ్ తో పాటు హీరోయిన్ ఆషిక రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దార్థ్ మునుపటిలా తనలోని రొమాంటిక్ వైబ్స్ చూపించబోతున్నాడు. అదే విధంగా ఈ చిత్ర కథ ఫీల్‌గుడ్ కంటెంట్ తో ఉండబోతోంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ.. ప్రేమలో ఉన్న బలహీనతల చుట్టూ ఈ చిత్ర కథ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News