Sunday, December 22, 2024

కేంద్ర మంత్రి రిజిజూకు తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

జమ్మూ : కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజూకు శనివారం జమ్మూ కశ్మీర్‌లో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును శనివారం ఓ భారీ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, మంత్రి ఇతరులు సురక్షితంగా ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయనను నిర్ణీత గమ్యానికి తరలించారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ లోడ్‌తో వస్తున్న ట్రక్కు ఒకటి రాంబన్ వద్ద మంత్రి కారును వేగంగా వచ్చి ఢీకొంది. మంత్రి స్కోర్పియో వాహనం ప్రమాదానికి గురైన విషయాన్ని గమనించగానే వెనుక ఉన్న ఆయన భద్రత సిబ్బంది వెంటనే ఉరుకులుపరుగులపై వచ్చి మంత్రి కారు తలుపులను లాగి లోపల ఉన్న వారిని బయటకు తీస్తున్న వీడియో దృశ్యాలు వెలువడ్డాయి.

కారులోపలి నుంచి నెమ్మదిగా మంత్రి రిజిజూ బయటకు రావడం ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా మెహరించడం కన్పించింది. కేంద్ర న్యాయ మంత్రి ఉద్ధంపూర్‌లో ఓ న్యాయ సేవల శిబిరంలో పాల్గొనేందుకు జమ్మూ నుంచి వెళ్లుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం అంతా ఉగ్రవాదుల సంచారానికి ఇంతకు ముందు పేరొందింది. ఇక్కడనే కేంద్ర మంత్రి ట్రక్కు ప్రమాదానికి లోను కావడంతో అధికారులు కంగుతిన్నారు. అక్కడ జరిగే కార్యక్రమానికి పలువురు జడ్జిలు, ప్రముఖ న్యాయవాదులు, నల్సా బృందం వారు హాజరువుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్థిదారులు అనేకులు ఇక్కడికి తరలివచ్చారు. సువిశాలం, చుట్టూ సుందరరమణీయ ప్రకృతి దృశ్యాలతో ఉండే రహదార్లపై ఇక్కడ సాగే వాహనాలు అన్ని కూడా కేంద్ర మంత్రి కారు ప్రమాదానికి గురైందని వార్తలు రావడంతో చాలా సేపటివరకూ నిలిచిపొయ్యాయి. అంతకు ముందు ఇక్కడి ప్రాంతాల గురించి రిజిజూ ట్వీటు కూడా వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News