అరకిలోమీటర్ దూరం వెళ్లి ఆగింది, ఆ వేగానికి బోగీలు కూడా కొంత దూరం వెళ్లాయి
తప్పిన పెనుప్రమాదం, ప్రయాణికులు క్షేమం
ఇంజిన్‌ను వెనకకు రప్పించి బోగీలతో లింక్ చేసి పంపించిన అధికారులు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘటన
స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేగేటు వద్ద దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ బోగీల నుంచి తెగిపోయిన ఘటన డివిజన్ కేంద్రంలో మంగళవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా దానాపూర్ వెళుతున్న దానాపూర్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేగేటు చేరుకునే క్రమంలో ఒక్కసారిగా బోగీల నుంచి ఇంజన్ తెగిపోయింది. దీంతో రైలు ఇంజన్ సుమారు అరకిలోమీటరు దూరం మేరకు వెళ్లి ఆగింది. రైలు ఇంజన్‌తో బోగీల లింకు తెగిపోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. లింకు తెగిన తరువాత బోగీలు కొంతదూరం ప్రయాణించి ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బోగీలు ఆగిన తరువాత ప్రయాణికులు బోగీల నుంచి కిందికి దిగి జరిగిన ఘటనను చూసి భీతిల్లిపోయారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇంజన్ వెనక్కి రప్పించి బోగీలతో లింకు చేసి తిరిగి రైలును పంపించారు.
Missed Train Mishap at station Ghanpur