Monday, December 23, 2024

కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదు

- Advertisement -
- Advertisement -

Missile rain is inevitable in Kiev:Russia warns Ukraine

ఉక్రెయిన్‌కు రష్యా హెచ్చరిక మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని రష్యా అధికారిక టీవీ వ్యాఖ్య
రష్యన్ యుద్ధ నౌక మునకతో మరింత వేడెక్కిన యుద్ధ వాతావరణం

కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదు
ఉక్రెయిన్‌కు రష్యా హెచ్చరిక
తమ భూభాగాలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపణ
మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: రష్యా అధికారిక టీవీ వ్యాఖ్య

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నానాటికి తీవ్రరూపం దాల్చుతోంది. ఉక్రెయిన్ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని హెచ్చరిస్తోంది. తమ భూభాగాలపై విధ్వసానికి దిగితే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదని రష్యా రక్షణ శాఖ హెచ్చరించింది. ‘రష్యా భూభాగంపై ఏదైనా ఉగ్రదాడి లేదా విధ్వసానికి పాల్పడాలని చూస్తే కీవ్‌పై క్షిపణి దాడులు మరింతగా పెరుగుతాయి’ అని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. రష్యా సరిహద్దు నగరాలను లక్షంగా చేసుకుని ఉక్రెయిన్ క్షిపణి దాడులకు పాల్పడుతోందని క్రెమ్లిన్ ఆరోపిస్తోంది. బెల్‌గోరోడ్ ప్రాంతంలోని ఓ గ్రామంపై ఉక్రెయిన్ గురువారం జరిపిన శతఘ్ని దాడుల్లో 20కి పైగా భవనాలు, ఓ స్కూలు బిల్డింగ్ దెబ్బతిన్నాయని స్థానిక అధికారులనుటంకిస్తూ టాస్ వార్తాసంస్థ తెలిపింది. గురువారం బ్రియాన్స్ ప్రాంతంలోని క్లిమోవో గ్రామంలో పౌర నివాస ప్రాంతాలపై దాడులు జరపడానికి పంపించిన ఉక్రెయిన్‌కు చెందిన ఎంఐ8 హెలికాప్టర్‌ను కూల్చేసినట్లు కూడా రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. కాగా ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా, దాని మిత్ర దేశాలను రష్యా హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖకు రష్యా ఒక నోట్‌ను పంపించింది.

కీవ్ మిలిటరీ ఫ్యాక్టరీపై క్షిపణి దాడి

మరోవైపు కీవ్ శివారుల్లో ఉన్న ఓ మిలిటరీ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో భారీగానే ఆయుధ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇక ఖార్కివ్‌కు సమీపంలోని గ్రామంపై రష్యా వ్యూహాత్మక రాకెట్ బలగాలు విరుచుకు పడ్యా. ఉక్రెయిన్‌కోసం పోరాడుతున్న 30 మంది పోలాండ్ సైనికులను హతమార్చినట్లు రష్యా మిలిటరీ తెలిపింది.

ఉక్రెయిన్ బలగాలకు జెలెన్‌స్కీ ప్రశంస

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమై 50 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌ను రక్షించుకొంటున్న వారికి ఆయన గౌరవ నివాళి అరించారు. దేశ ప్రజలు ధైర్యంగా ఉన్నారన్నారు. రష్యా దాడికి 50 రోజులు గడిచిపోయాయని,ఈ 50 రోజుల్లో ప్రపంచ దేశాధినేతలు భిన్న రకాలుగా స్పందించారన్నారు. కొందరు రాజకీయ నేతలు తమ చేతుల్లో అధికారం లేనట్లుగా వ్యవహరించారన్నారు. మేటి రాజకీయ నేతలకన్నా అధికారంలోని వారు ఈ 50 రోజుల్లో ఎంతో చేశారని ఆయన గుర్తు చేశారు. ఉక్రెయిన్ దళాలను ప్రశంసిస్తూ రష్యా యుద్ధ నౌకలు పాతాళానికి పోవలసిందేనని రష్యా యుద్ధ నౌక మాస్కువా మునిగిపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జెలెన్‌స్కీ అన్నారు.

రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు?

ఉక్రెయిన్‌లో రష్యా దారుణంగా వైఫల్యం చెందుతోందంటూ వార్తలు వెలువడినప్పటినుంచి రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు అంతగా బయటికి కనిపించడం లేదు. అధికార మీడియా ప్రకటనలకు సైతం దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇలా ఉక్రెయిన్ ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఆయన తీవ్ర గుండెపోటు బారిన పడ్డారని రష్యాఇజ్రాయెల్ వ్యాపారవేత్త లియోనిద్ నెవ్‌జెలిన్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా అది సహజంగా వచ్చినట్లు కనిపించడం లేదని కూడా ఆరోపించారు.

నీట మునిగిన రష్యా యుద్ధ నౌక ‘మాస్కువా’

మాస్కో: ఉక్రెయిన్ సముద్రంలో గురువారం జరిగిన భారీ పేలుడులో తీవ్రంగా దెబ్బతిన్న రష్యా యుద్ధ నౌక ‘మాస్కువా’ పూర్తిగా నీట మునిగిపోయింది. తొలుత ఈ నౌక దెబ్బతినడంతో ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు.కానీ ఈ క్రమంలో దెబ్బతిన్న నౌకను ఒడ్డుకు నెట్టే సమయంలో బ్యాలెన్స్ కోల్పయి పూర్తిగా నీట మునిగిపోయినట్లు రష్యా వార్తాసంస్థ ‘టాస్’ పేర్కొంది. ఈ నౌకలో అంతర్గతంగా జరిగిన పేలుడు కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రష్యా చెబుతోంది. అయితే ఉక్రెయిన్‌లోని ఒడెస్సా విభాగం సైనిక ప్రతినిధి సెర్గీ బ్రాట్చిక్ మాత్రం నెప్టూన్ క్రూజ్ క్షిపణిని ప్రయోగించి తాము దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ నౌక మునగడానికి గల కారణాలను ధ్రువీకరించలేమని అమెరికాలోని పెంటగాన్ ప్రతినిధి జాన్ కెర్బీ పేర్కొన్నారు.

రష్యా యుద్ధం ప్రారంభించిన తొలి రోజు మాస్కువా ఉక్రెయిన్‌లోని స్నేక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి సిబ్బందిని నిర్బంధించింది.ఈ నౌకను సోవియట్ సమయంలో నిర్మించారు. సిరియా యుద్ధంలో ఈ నౌక రక్షణలోనే రష్యా సైనికులకు సరిగాయి. ఈ నౌక ఆయుధాలతో నిండిఉంటుంది. 16 యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులతో పాటు యాంటీసబ్‌మెరైన్, మైన్ టోర్పిడో ఆయుధాలు దీనిలో ఉన్నాయి. ఈ నౌకను కోల్పోవడంతో నల్ల సముద్రంలో రష్యా దాడి చేసే సామర్థం గణనీయంగా తగ్గిపోయినట్లయింది. అంతేకాక, ఇప్పటికే భారీ చారిత్రక తప్పిదంగా మారిన ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రతిష్ఠకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది

ఈ యుద్ధ నౌక మునకతో మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లయిందని రష్యా అధికార టెలివిజన్ రష్యా 1 వ్యాఖ్యానించింది. మాస్కువా యుద్ధ నౌక మునిగిపోవడంతో మూడు ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లేనని ఈ టీవీ ప్రజెంటర్ ఓల్గా స్కబయేవా వ్యాఖ్యానించారు. నాటోతో కాకపోయినా మనం ఇప్పుడు నాటో ఆయుధ వ్యవస్థలతో పోరాడుతున్నాం. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది’ అనిస్కబయేవా అన్నట్లు మెట్రో న్యూస్ తెలిపింది. కాగా ఈ వ్యాఖ్యలున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News