- Advertisement -
ఒడిశా లోని చాందీపూర్ ప్రాంతం లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి క్షిపణి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమీపం లోని గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 32,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. ఐటీఆర్ లాంచ్ ప్యాడ్3 నుంచి దగ్గరగా ఉన్న ఆరు గ్రామాల ప్రజలను బుధవారం తెల్లవారు జామున సమీపం లోని మూడు ప్రభుత్వ కేంద్రాలకు తరలించినట్టు పేర్కొన్నారు. క్షిపణి పరీక్షలు ముగిసే వరకు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉండాలని సూచించింది. వారి వసతి, ఇతర అవసరాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. ప్రజల అవసరాలు, బాగోగులు చూడడానికి వందమందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించినట్టు తెలుస్తోంది.
- Advertisement -