Monday, December 23, 2024

అత్యాచారం, హత్యకు గురైన ఐదేళ్ల బాలిక

- Advertisement -
- Advertisement -

కొచ్చి (కేరళ) : అదృశ్యమైన ఐదేళ్ల బాలికను కనుగొనలేక పోవడమే కాక, ఆమె అత్యాచారానికి, తరువాత హత్యకు బలైన తరువాత మృతదేహం బయపడడం పోలీస్‌లను బాధించింది. బాలికను రక్షించలేక పోవడం తమ వైఫల్యంగా పోలీస్‌లు బాధతో “సారీ డాటర్ ” అని ఎక్స్(ట్విటర్)లో క్షమాపణ పోస్ట్ చేశారు. కేరళ లోని ఎర్నాకుళం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు బీహార్ నుంచి వచ్చారు. శుక్రవారం బాలిక కనిపించకపోవడంతో వెతికి చివరకు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా పోలీస్‌లు గాలించగా, చివరకు అలువా సమీపాన స్థానిక మార్కెట్ వెనుక చిత్తడి నేలపై గోనెసంచి మూటలో బాలిక శవం బయటపడింది. నిందితుడిని మరునాడు పట్టుకోగలిగారు.

బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు తిరిగి అప్పగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయని కేరళ పోలీస్‌లు బాధపడ్డారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో బాలిక అత్యాచారానికి గురైన తరువాత హత్యకావింపబడిందని పోలీస్ అధికారులు తెలిపారు.సిసిటివి విజువల్స్ ఆధారంగా పోలీస్‌లు నిందితుడిని శనివారం పట్టుకోగలిగారు. నిందితుడు బీహార్ నుంచి వచ్చాడు. బాలిక కుటుంబం ఉంటున్న భవనం మొదటి అంతస్తులో నిందితుడు ఉండేవాడు. నిందితుడు మద్యం మత్తులో మునిగిపోవడంతో మొదట దర్యాప్తు చేయడం, వివరాలు సేకరించడం పోలీస్‌లకు కష్టమైంది. శనివారం నిందితుడు తన నేరం ఒప్పుకున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News