Friday, November 15, 2024

బెంగళూరులో బాలుడు మిస్సింగ్… హైదరాబాద్‌లో పట్టిచ్చిన సోషల్ మీడియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటక రాజధాని బెంగళూరులో అదృశ్యమైన బాలుడిని సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్‌లో గుర్తించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తన కుమారుడిని గుర్తించిన వ్యక్తితో పాటు సోషల్ మీడియా యూజర్లకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బెంగళూరుకు చెందిన పరిణవ్ ఆరో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం బాలుడు కోచింగ్ సెంటర్‌కు ఇంటిని నుంచి బయలుదేరారు. కోచింగ్ సెంటర్ నుంచి పరిణవ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతికారు.

ఎక్కడ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో భాగంగా స్థానిక సిసి కెమెరాలను పరిశీలించారు. జనవరి 21న ఉదయం 11 గంటలకు కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు. అనంతరం బస్సులో అక్కడి నుంచి మేజిస్టిక్ బస్టాండ్‌కు వెళ్లాడు. ఆ బస్టాండులో కర్నాటకలోని వివిధ ప్రాంతాల బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల బస్సులు ఉండడంతో బాలుడు ఎక్కడికి వెళ్లిన విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు సిసి కెమెరాల వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తన కుమారుడు కనిపించడం లేదని పోస్టు చేశారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ బెంగళూరు వాసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద బాలుడిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నాంపల్లి పోలీసులు కర్నాటకలో ఉన్న అతడి తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో ఫోన్‌లో మాట్లాడించారు. తన కుమారుడి ఆచూకీ కనుగొనిన నెటిజన్ యూజర్లకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని తీసుకొని వెళ్లేందుకు వారు హైదరాబాద్‌కు వస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News