Sunday, April 6, 2025

హన్మకొండలో విషాదం.. అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

హన్మకొండః జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన పరకాలకు చెందిన పదహారేళ్ల అఖిల్ శవమై కనిపించాడు. స్నేహితడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిన అఖిల్ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. బుధవారం పరకాల శివారులో ఉన్న చలివాగులో అఖిల్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News