Monday, December 23, 2024

అదృశ్యమైన విద్యార్ధి …మూడు నెలల తర్వాత

- Advertisement -
- Advertisement -

బోధన్ : మూడు నెలల క్రితం కనిపించకుండా పోయిన యువకుడు విగత జీవిగా కనిపించాడు. అదృశ్యం అయిన వాడు అనంత లోకాలకు వెళ్లాడు. అదృశ్యం అయిన యువకుడు శవమై కనిపించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్లితే… బోధన్ మండలం ఖన్‌డ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ బోధన్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఓ యువతితో ప్రేమ వ్యవహరం వివాదానికి కారణమైంది. మూడు నెలల క్రితం శ్రీకాంత్ అదృశ్యం అయ్యాడు. శ్రీకాంత్ తల్లిదండ్రులు బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేశారు. మూడు నెలలుగా యువకుని ఆచూకీ దొరకలేదు. శ్రీకాంత్ అదృశ్యం పై తల్లిదండ్రులు పోలీసు కమిషనర్ ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

సోమవారం ఉదయం పట్టణ శివారులోని పసుసు వాగు వద్ద శ్రీకాంత్ మృత కళేబరాన్ని పోలీసులు గుర్తించారు. చెట్టుకు బెల్ట్ కట్టి ఉండడం ఆ ప్రక్కనే మృతదేహం పడి ఉంది. పూర్తిగా కుళ్ళిపోయి మృత కళేబరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీకాంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు డాగ్ స్కాడ్‌ను రప్పించారు. కానీ శ్రీకాంత్ తల్లిదండ్రులు బంధువులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ మృతికి కారణం అయిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహం తరలించకుండా అడ్డుకొని రోడ్డు పై బైఠాయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News