- Advertisement -
హైదరాబాద్: మణికొండలో గల్లంతైన రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్ చెరువులో మృతదేహం లభ్యమైంది. జెసిబితో గుర్రపు డెక్కను తొలగిస్తుండగా మృతదేహం బయటపడింది. గత రెండు రోజుల క్రితం రజనీకాంత్ అనే వ్యక్తి నాలాలో కొట్టుకపోయిన విషయం తెలిసిందే. ఎన్డిఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు ఇక్నాంపూర్ చెరువులో గాలింపు చర్యలు చేపట్టాయి. జెసిబి సహాయంతో గుర్రపు డెక్కను తొలగిస్తుండగా మృతదేహం కనిపించింది. వర్షాకాలంలో ఎలాంటి సమాచారం లేకుండా నాలా పైపు పనులు చేపడుతున్నా ప్రభుత్వాధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.
- Advertisement -