Sunday, January 19, 2025

పెన్నానది సమీపంలో విద్యార్థిని మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

Missing girl Dead body found near Penna River

కడప: కళాశాల నుంచి నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఓ విద్యార్థిని పెన్నా నది సమీపంలో శవమై కనిపించింది. బి.కోడూరు మండలానికి చెందిన అనూష బద్వేల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్టోబర్ 20న కాలేజీకి వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు బద్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె మృతదేహం సిద్దమటం సమీపంలోని జంగాలపల్లె ఇసుక రీచ్ వద్ద అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా? అనే విషయంపై పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కూతురు ఆత్మహత్య చేసుకోదని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. పథకం ప్రకారమే ఆమెను హత్య చేశారని, బద్వేల్ మండలం పాపిరెడ్డిపాలేకు చెందిన గురు మహేశ్‌రెడ్డితో పాటు మరికొంత మంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యమే తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, అక్టోబర్ 20న మిస్సింగ్ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అనూషతో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు బద్వేల్ రూరల్ సీఐ హనుమంత్ నాయక్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News