Friday, December 20, 2024

కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యం: డిసిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శుక్రవారం అదృశ్యమైన ఆరు సంవత్సరాల బాలిక ఆచూకీ లభ్యమైందని సెంట్రల్ జోన్ డిసిపి అక్షన్స్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు బాలిక అదృశ్యమైందని ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి సిసి టివి ఫూటేజీ సహాయంతో విచారణ ప్రారంభించామన్నారు. కట్టెలమండి నుండి ఆటోలో అమ్మాయిని ఓ వ్యక్తి తీసుకొని అఫ్జల్ గంజ్  వరకు వెళ్ళినట్టు గుర్తించామని, అక్కడి నుండి బస్సులో కొత్తూరు మండలం ఇమ్ముల్ నారా గ్రామానికి బాలికను నిందితుడు తీసుకెళ్లాడు. స్థానిక పోలీసులు సహాయంతో నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. బాలికను సురక్షితంగా హైదరాబాద్ కు తీసుకొచ్చామన్నారు.

కొత్తూరులో లేబర్ బేస్ క్యాంప్ లో బిహార్ కు చెందిన బిలాల్ పనిచేస్తున్నాడు. గతంలో నిందితుడుపై బీహార్ లో రెండు కేసులు ఉన్నాయని, కొత్తూరు పోలీస్ స్టేషన్ లో 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ కేసు ఉందని డిసిపి తెలిపారు. నిందితుడికి నేర చరిత్ర ఉందన్నారు. బాలికకు చాక్లెట్ తో పాటు సైకిల్ ఇస్తానంటూ బిలాల్ తీసుకెళ్లాడు. బాలిక ను కిడ్నాప్ చేసి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడని వివరించారు. సిసి కెమెరాలతో కొన్ని గంటల్లోనే కేసును చేధించామని డిసిపి వెల్లడించారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం భరోసా సెంటర్ కు పంపించామని డిసిపి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News