Monday, December 23, 2024

హెలికాప్టర్ అదృశ్య ఘటన విషాదాంతం.. ఐదుగురి మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

నేపాల్ లో హెలికాప్టర్ తప్పిపోయిన ఘటన విషాదాంతమైంది. ఆరుగురు వ్యక్తులతో నేపాల్‌లోని నొలుఖుంబు నుంచి ఖట్మాండు వెళుతున్న హెలికాప్టర్‌ ఉదయం 10 గంటల ప్రాంతంలో తప్పిపోయినట్లు గుర్తించిన అధికారులు సెర్చ్ టీమ్ ను అలర్ట్ చేసింది. కొద్ది సమయంలోనే లిఖు పికె గ్రామ కౌన్సిల్, దుద్కుండ మునిసిపాలిటీ-2 సరిహద్దులో సెర్చ్ టీమ్ హెలికాప్టర్ శకలాలను గుర్తించింది.

హెలికాప్టర్ కొండపై ఉన్న చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సెర్చ్ టీమ్ ఐదు మృతదేహాలను గుర్తించిందని చెప్పారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురి బాడీలు లభించగా, మరో వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: రాజకీయాల నుంచి తప్పుకుంటా : డచ్ ప్రధాని మార్క్ రుట్టే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News