Saturday, December 21, 2024

లండన్‌లో భారతీయ విద్యార్థి విషాదాంతం

- Advertisement -
- Advertisement -

లండన్ : ఉన్నత విద్యాభ్యాసానికి బ్రిటన్‌కు వెళ్లిన భారతీయ విద్యార్థి గురష్మన్ సింగ్ భాటియా విషాదాంతం చెందాడు. ఆయన మృతదేహం ఇప్పుడు ఇక్కడి ఓ సరస్సులో తేలింది. స్నేహితులతో కలిసి రాత్రిపూట షికార్లకు వెళ్లి , కన్పించ కుండా పోయిన తరువాత సింగ్ చనిపోయి ఉన్న స్థితిలో కన్పించాడు. 23 సంవత్సరాల గురష్మన్ సింగ్ చనిపోయిన ఉదంతంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పు లండన్‌లో కెనరీ వార్ఫ్‌లోని లేక్‌లో ఈ యువకుడి మృతదేహం గుర్తించినట్లు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఆయన జాడ తెలియకుండా పోయింది. మెట్రోపాలిటన్ పోలీసు అధికారుల బృందం పెద్ద ఎత్తున జరిపిన గాలింపులు,

సిసిటీవీ కెమెరాల ఆధారంగా ఎట్టకేలకు ఈ యువకుడి శవాన్ని కనుగొన్నారు. ఈ భారతీయుడి సంగతి గురించి బిజెపి నేత మంజీందెర్ సింగ్ సిర్సా వెంటనే కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు తెలియచేశారు. ఈ క్రమంలో ఈ యువకుడి ఆచూకికి గాలింపు ఉధృతం అయింది. ఈ యువకుడు లాఫ్‌బర్గ్ యూనివర్శిటీలో డిజిటల్ ఫైన్సాన్‌లో ఎంఎస్‌సి చదువుతున్నాడు. కాగా సెప్టెంబర్‌లోనే 23 సంవత్సరాల భారతీయ విద్యార్థి మిత్కుమార్ పటేల్ థేమ్స్ నదిలో శవమే కన్పించాడు. బ్రిటన్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి ఆయన వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News