Wednesday, January 22, 2025

తల్లి బిడ్డ అదృశ్యం.. కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

కడ్తాల్: తల్లి, రెండేండ్ల కుమారుడు అదృశ్యమైన ఘటన కడ్తాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కడ్తాల ఏఎసై ప్రసాద్‌జీ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల సరస్వతి ఈ నెల 24వ తేదిన తన తోటి కోడలు స్వప్నతో కుటుంబ విషయంలో గొడవ పడి ఎవరికి చెప్పకుండా తన రెండు సంవత్సరాల కుమారుడు శ్రీచరణ్‌తో కలిసి బయటకు వెళ్లిపోయిందని, తిరిగి రాకపోవడంతో బంధువుల వద్ద, పరిసర ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎసై ప్రసాద్‌జీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News