Sunday, December 22, 2024

మైనర్ బాలిక అదృశ్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కరకగూడెం: కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయితీ పరిధిలో నివసిస్తున్న చిర్ర నాగరాజు కుమార్తె చిర్ర లావణ్య (17) అనే మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బట్టుపల్లి గ్రామంలో నివాసముంటున్న చిర్ర నాగరాజు, సామ్రాజ్యం దంపతుల రెండవ కుమార్తె లావణ్య బుధవారం ఉదయం గం. 11.00లకు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.

సాయంత్రం వరకు రాకపోవడంతో చిన్న కూతురు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు అంతా వెతికి గురువారం నాడు తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్థానిక పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీవన్ రాజు తెలిపారు. వివరాలు తెలిసిన వారు 7995770191, 9440904284 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News