Monday, December 23, 2024

గోవాలో నగర యువకుడి అవయవాలు మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

తల,కడపు భాగంలో కుట్లు వేసిన ఆనవాళ్లు
ఆందోళనలో కుటుంబ సభ్యులు
కిమ్స్‌లో వైద్య పరీక్షలు

Missing organs in Goa
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బోరబండకు చెందిన టెంపో డ్రైవర్ శ్రీనివాస్ ఆవయవాలు మాయం చేసినట్లు అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో శ్రీనివాస్ తల,కడపు భాగంలో కుట్లు వేసి ఉండటంతో అతనికి మత్తుమందు ఇచ్చి శరీరంలో కీలక అవయవాలను మాయం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..గత నెల 19న బోరబండకు చెందిన శ్రీనివాస్‌తో పాటు మరో 9మందితో కలిసి గోవాకు వెళ్లారు. కాగా మార్చి 20న గోవాలో టెంపో డ్రైవర్ శ్రీనివాస్ అదృశ్యమవడంతో ప్రయాణికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

దీంతో గోవా వెళ్లి శ్రీనివాస్ కోసం గాలించిన కుటుంబీకులు ఫలితం లేకపోవడంతో గోవాలోని అంజున ఠాణాలో ఫిర్యాదు చేశారు. అయితే గోవాలో అదృశ్యమైన శ్రీనివాస్ వారం రోజుల కిందట ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ తల,కడుపు భాగంలో కుట్లు ఉండటంతో కుటుంబ ఆందోళన చెందుతున్నారు. గోవాలో మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే గోవాలో అసలు ఏం జరిగిందని అడిగినప్పటికీ శ్రీనివాస్ పూర్తిస్తాయిలో స్పష్టంగా సమాధానం చెప్పడం లేదని, అతనికి మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నారా? అని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.

దీంతో బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ సహకారంతో శ్రీనివాస్‌ను నిమ్స్‌కు తరలించారు.ప్రస్తుతం శ్రీనివాస్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అలాగే అవయాలకు సంబంధించి స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. గోవాకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో అతనికి మత్తుమందు ఇచ్చి అవయవాలు తీసుకున్నట్లు కుటుంసభ్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News