Sunday, December 22, 2024

అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన గంగు లింగం 50 సంవత్సరాలు అనే వ్యక్తి ఈ నెల 21 శుక్రవారం నుండి కనిపించడం లేదని పోలీసులకు భార్య లావణ్య ఫిర్యాధు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుపగా శనివారం మన తెలంగాణ దిన పత్రికలో వ్యక్తి అదృశ్యం అనే వార్త ప్రచురితమైంది. ఆదివారం ఉదయం మండలంలోని బసవన్నపల్లి గ్రామ శివారులోని పెద్దాయిపల్లి రోడ్డు పక్కన నాయికమ్మ గుడి వద్ద గంగు లింగం మృతదేహం అనుమానస్పదంగా లభించింది.

Also Read: చలాకి చంటికి గుండెపోటు

క్లూస్ టీం డాగ్ స్కాడ్ తో పరిసరాలను పరిశీలించారు. లింగం గొంతు కోసి హత్య చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. లింగం మృతికి భార్య లావణ్య కారణమని మృతుడి కుటుంబీకులు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేసారు. దీంతో రాజంపేట్, బిక్కనూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News