Sunday, January 19, 2025

ముగ్గురు అక్కచెల్లెళ్లు.. ట్రంకుపెట్టెలో శవాలై

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : వలస కూలీల కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు శవాలుగా ఓ ట్రంకుపెట్టెలో ఉండగా కనుగొన్నారు. 4 ఏండ్ల కంచన్, 7 ఏండ్ల శక్తి, 9 ఏండ్ల అమృతలు ప్రాణాలు కోల్పోయిన స్థితిలో జలంధర్ జిల్లాలోని కాన్పూర్‌లోని వారి పూరింట్లోనే పెట్టెలో పడి ఉన్నారని పోలీసులు సోమవారం తెలిపారు. ఐదుగురు పిల్లలున్న తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పని ముగించుకుని వచ్చిన వీరికి తమ పిల్లల్లో ముగ్గురు కన్పించకుండా పోవడంతో కంగుతిన్నారు. వెంటనే అక్కడి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విషయం తెలిపారు.

సోమవారం ఉదయం బాలికల తండ్రి ఇంట్లోని వస్తువులను సర్దుతూ ఉండగా ఓ పెట్టె బరువుగా ఉందని గుర్తించినట్లు, తీసి చూడగా ఇందులో బిడ్డల శవాలు కన్పించాయని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఆడపిల్లల విషాదాంతానికి దారితీసిన పరిస్థితులపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లల తండ్రికి తాగుడు అలవాటు ఉందని, చేసే గోల సహించలేక ఈ మధ్యనే ఇంటి ఓనరు వచ్చి తిట్టివెళ్లాడని, పద్ధతి మార్చుకోకపోతే బయటకు నడవాలని బెదింరించాడని తెలిసినట్లు పోలీసులు చుట్టుపక్కల వారి నుంచి అందిన సమాచారంతో నిర్థారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News