Friday, October 18, 2024

 టైటాన్ ఆచూకీ లభ్యం..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : సముద్ర గర్భంలో గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి ఆచూకీ లభ్యమైనట్టు అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. టైటాన్‌ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్‌ఒవి) టైటాన్ శకలాలు కొన్నిటిని గుర్తించిందని పేర్కొంది. ఆర్‌వోవీ పంపిన సమాచారాన్నినిపుణులు విశ్లేషిస్తున్నారని తెలియజేసింది. టైటానిక్ ఓడ శిథిలాల పక్కనే టైటాన్ శకలాలను గుర్తించినట్టు సమాచారం. అట్లాంటిక్ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతు లోని టైటానిక్ నౌక శిధిలాలను

చూడడానికి ఐదుగురు పర్యాటకులు ఆదివారం న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి మినీ జలాంతర్గామి టైటాన్ ద్వారా బయల్దేరారు. ఆ తరువాత మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది దీంతో ప్రమాద ప్రాంతంలో అమెరికా కోస్ట్ గార్డ్ , కెనడా సైనిక విమానాలు, ఫ్రెంచ్ నౌకలు, టెలీగైడెడ్ రోబోలతో భారీ ఎత్తున అన్వేషణ చేపట్టారు. ఈ నేపథ్యంలో టైటాన్ ఆచూకీ కనుగొన్నట్టు అమెరికన్ కోస్ట్ గార్డ్ ట్వీట్ చేసింది. అయితే అందు లోని పర్యాటకుల పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

Also Read: కెసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News