Thursday, January 23, 2025

ఉడుతా ఉడుతా ఉచ్ ….

- Advertisement -
- Advertisement -

మిచిగాన్ : అమెరికాలో ఓ రెండేళ్ల బాలిక థియా ఛేజ్ అడుగులో అడుగులేసుకుంటూ తోడుగా ఇంటి జంట కుక్కలు తోడు రాగా ఇల్లు వదిలివెళ్లింది. దీనితో ఇంట్లోని వారికి వణుకు పుట్టింది. విషయాన్ని స్థానిక అధికారులకు తెలియచేశారు. రాత్రంతా డ్రోన్లు, పోలీసు డాగ్స్‌తో చుట్టుపక్కల గాలించగా , వీరికి తోడుగా స్థానికులు, స్థానిక పోలీసులు కూడా కలిసి జల్లెడ పట్టగా ఇంటికి మూడు మైళ్ల దూరంలో ఈ పాప దర్జాగా నిద్రపోతూ పొదల మధ్య నిద్రపోతూ కన్పించింది. మొత్తటి చర్మంతో ఉన్న ఓ పెంపుడు కుక్కనుతలగడగా చేసుకుని,

మరో పక్కన మరో శునకం వీరికి భద్రతగా అన్నట్లు కాపలా ఫోజులో నిలబడి ఉంది. పలు గంటల పాటు గాలింపు తరువాత పాప దొరికింది. ఆమె భద్రంగా ఉందని, పైగా హాయిగా నిద్రపోతూ ఉందని గాలింపు చర్యలకు సారధ్యం వహించిన లెఫ్టినెంట్ మార్క్ గియానుంజియో తెలిపారు. పాపకు వైద్య పరీక్షలు జరిపారు. అంతా బాగుందని తెలిసిన తరువాత స్థానికులే కాకుండా అమెరికా అంతటా ఆనందం వెల్లివిరిసింది. పాప తప్పిపోవడం వెనుక ఎటువంటి దుశ్చర్యలు, తల్లిదండ్రుల ఇంటివారి నిర్లక్షం లేదని అధికారులు తేల్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News