Wednesday, January 22, 2025

మిషన్ భగీరధ నీళ్ళు అందేదెన్నడు

- Advertisement -
- Advertisement -

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ ప్రజలకు మిషన్ భగీరధ నీళ్ళు పూర్తిస్థాయిలో అందేది ఎన్నడని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరీ ప్రశ్నించారు. గురువారం హుజూర్‌నగర్‌లో మిషన్ భగీరధ నీళ్ళు రావం లేదంటూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల పలు వార్డులకు మిషన్ భగీరధ నీళ్ళు రావడంలేదని తెలిపారు. ఒకవేళ నీళ్ళు వచ్చినా అవి ఎప్పుడు వస్తాయో, ఎంత సేపు వస్తాయో తెలియని పరస్థ్ధితి ఉందన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మున్సి పాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో మిషన్ భగీరధ నీళ్ళు పూర్తిస్ధాయిలో అందు బాటులోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిచ్చమ్మ, ఆదిలక్ష్మీ, వనిత, యమున,మౌనిక, సుజిత, కలమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News