Tuesday, November 5, 2024

తెలంగాణ ప్రజల ఆయుర్ధాయం పెంచుతున్న మిషన్ భగీరథ తాగునీరు

- Advertisement -
- Advertisement -

గద్వాల: శుద్దమైన తాగునీరు అందించి తెలంగాణ ప్రజల ఆయుర్ధాయం పెంచుతున్న మిషన్ భగీరథ తాగునీరు వృధా చేయరాదని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంచినీళ్ల పండుగ దినోత్సవ కార్యక్రమాన్ని జూరాల డ్యాం దగ్గర గల మిషన్ భగీరథ హెడ్ వర్క్ దగ్గర నిర్వహించగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డా.అబ్రహంతో కలిసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ సరిత మాట్లాడుతూ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే విధంగా ప్రతి కార్యక్రమం తెలంగాణలో చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని మొదలు పెడతాయని అన్నారు. ఉదాహరణ మిషన్ భగీరథ ఈ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించి రికార్డు స్థాయిలో శుద్ద జలం అందించడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరిసిస్ వ్యాధిని దూరం చేసేందుకు ప్రారంభించిన మిషన్ భగీరథ ఇంటింటికి మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నదని తెలిపారు.

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ప్రారంభించిన మిషన్ భగీరథ తాగునీటి పథకం గ్రామ గ్రామాన ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. ట్యాంకుల ద్వారా రోజుకు 70 మిలియన్ల నీటిని శుద్ద చేసి పంపించేయడం జరుగుతుందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా 67 కిలో మీటర్ల అంతర్గత వైప్ లైన్లు, 57 లక్షల నల్లా కనెక్షన్‌లు ఇచ్చి ఇంటింటికి తాగునీరు అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందని అన్నారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్చమైన తాగునీరు ఇంటింటికి చేరుతున్నాయి అంటే అది ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కష్టమని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రికార్డు స్థాయిలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. అప్పట్లో గ్రామాలలో పైపులైన్లు వేయడానికి గ్రామస్తులు ఇంటి యజమానులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా ప్రజాప్రతినిధుల సహకారంతో పరిషఅకరించి పైపులను వేయించడం జరిగిందన్నారు. నేడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ గ్రామ మారుమూలతాండాలకు తాగునీరు అందించడం జరిగిందని తెలిపారు.

అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి ఎలా ఉండేదని వివరించారు. వాగులలో చెలిమెలలో బావులలో నానా కష్టాలు పడి తాగునీటికి సమయం వెచ్చించి ఇతర పనులు వదులుకొని కష్టపడి తాగునీరు తెచ్చుకునే వారమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహన్, వైస్ చైర్మన్ సరోజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ్, భీమేశ్వర్ ఈఈ, శ్రీధర్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్, ఏంపిపి నజుమున్నిసాబేగం, సర్పంచ్ శిల్ప ప్రభాకర్‌గౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News