Wednesday, January 22, 2025

మిషన్ భగీరథ దేశంలోనే ఓ గొప్ప ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

దామెర: మిషన్ భగీరథ దేశంలోనే ఓ గొప్ప ప్రాజెక్టు అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ మంచినీళ్ల పండుగ దినోత్సవం సందర్భంగా మండలంలోని సింగరాజుపల్లి గ్రామ శివారులోని వాటర్ గ్రిడ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఎస్‌ఆర్‌డీసీ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఎస్‌ఆర్‌డీసీ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు స్వరాష్ట్రంలో మిషన్ భగీరథతో సిఎం కెసిఆర్ శాశ్వత పరిష్కారం చూపించారన్నారు.

పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకంలో గ్రీడ్ భాగంగా పరకాల నియోజకవర్గంలో మొత్తం 164 ఆవాసాలు, పరకాల మున్సిపాలిటీకి ఈ మిషన్ భగీరథ నీటిని అందచేస్తున్నామన్నారు. గతంలో నీటి కోసం యుద్ధాలు చేసిన సందర్భాలు కోకొల్లలుగా చూశామన్నారు. బిందెలతో రోడ్లపై క్యూలు కట్టిన రోజులు చూశామని, మహిళల నీటి కష్టాలు చూసిన సిఎం కెసిఆర్ ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం ప్రతీ ఇంటికి తాగునీళ్లు అందిస్తున్నదని వాస్తవం కాదా అని తెలిపారు.

మహిళల నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు సిఎం కెసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకటేశ్వర్‌రావు, ఈఈ మాణిక్యరావు, డీఈ శ్రీనివాస్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మండల ప్రజా ప్రతినిధులు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News