ఇందల్వాయి: దేశానికే ఆదర్శంగా నిలిచిన సిఎం కెసిఆర్ మానస పుత్రిక ’మిషన్ భగీరథ’ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో నీటి శుద్ధి కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండగ ,తాగునీటి విజయాలపై సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిచ్‌పల్లి మండలంలో 52గ్రామాలకు, 172 కిలోమీటర్ల పైపులైన్, 40 కొత్తగా నిర్మించిన ట్యాంకు మొత్తం బిగించిన నల్లాలు 15033 ఖర్చు రూ.147 కోట్లని తెలిపారు. ఇందల్వాయి మండలంలోని 40 గ్రామాలకుగాను మొత్తం 108 కోట్ల వ్యయంతో మంచినీటి పైపులైన్లు, కొత్తగా ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు. దర్పల్లి మండలంలోని 38 గ్రామాల్లో మంచినీటి పైపులైన్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణాలకుగాను మొత్తం 58 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు.
సిరికొండ మండలంలో 70గ్రామాలలో 106 కోట్లతో వాటర్ ట్యాంక్‌లు, పైపులైన్ల నిర్మాణాలు చేపట్టడంజరుగుతుందన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని 24 గ్రామాలలోనూ మంచినీటి పైపులైన్లు, నల్లాలు, ట్యాంకులు మొత్తం ఏడు మండలాల్లో రూ. 612 కోట్లతో నిర్మాణాలు చేపట్టి తాగునీరు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు. మిషన్ భగీరథకు 2019లో నేషనల్‌వాటర్ కమిషన్ అవార్డు కింద రూ.2లక్షల బహుమతి అందుకోవడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నల్లా కనెక్షన్లు ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నందుకు జల్ జీవన్ అవార్డు 2022 కింద ప్రథమ బహుమతి లభించిందని తెలిపారు.
మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అనే పేరుతో అమలు చేయడం తెలంగాణాకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ ఛైర్మన్ సాంబారి మోహన్, స్థానిక ఎంపిపి రమేష్‌నాయక్, వైస్ ఎంపిపి భూసాని అంజయ్య, మండల అధ్యక్షుడు చిలువేరి దాసు, సొసైటీ ఛైర్మన్ గోవర్ధన్, సీనియర్ నాయకులు పాశం కుమార్, సత్యనారాయణ, పులి వసంత, వివిధ మండలాల జడ్‌పిటీసీలు, ఎంపిపీలు, మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధసంఘాల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటిసీలు, మిషన్ భగీరథ అధికారులు, తాగునీటిశాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.