Sunday, December 29, 2024

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • మంగోల్‌లో మంచినీళ్ల పండుగలో పలువురు నాయకులు, అధికారులు

కొండపాక: తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పలువురు నాయకులు ఆదివారం రాష్ట్ర ఆవతరణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కుకునూరుపల్లి మండల మంగోల్ మల్లన్న సాగర్ తాగునీటి శుద్ధ్దీకరణ ప్లాంట్‌లో మిషన్ భగిరథ విభాగం వారిచే మంచినీళ్ల ప ండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్, ఆలేరు, జనగామ నియోజక వర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు అదేశాలతో జిల్లాలో మంచినీళ్ల పండుగ ఇంత గొప్పగా నిర్వహించిన అందరికి అభినందనలు తెలిపారు.

పండుగలా ద శాబ్ది ఉత్సవాలు జిల్లాలో జరుగుతున్నాయన్నారు. ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేట నియోజక వర్గ అ భివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను తెలంగాణ సాధించిన తర్వాత రా ష్ట్రంలో అమలు చేసి దేశంలోనే రాష్ట్రం గర్వపడేలా అభివృద్ధి చేసారన్నారు. సమైక్య పాలనలో చుట్టాలు ఇంటికి వస్తే తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేని దీన స్థితి నుండి మిషన్ భగీరథ కార్యక్రమంలో నల్లాల ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించిన ఆపర భగీరథుడు సిఎం కెసిఆర్ అని కొనియాడారు. ప్రతి నీటి బోడ్డులో కెసిఆర్ రూపంను చూస్తున్నామన్నారు. ఇంటింటితో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల కా ర్యాలయాలకు మిషన్ భగీరథనీటిని సరఫరా చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ విఫ్ గొంగడి సునిత మాట్లాడుతూ కోమటి బండ డబ్లూటిపి ద్వారా అలేరు, భువనగిరికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. హెచ్‌ఎండిఏకు కూడా అక్కడి నుండే పంపించడంతో భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు భవిష్యత్తులో త్రాగునీరు సమస్య వస్తదని సిఎం కెసిఆర్‌కు తెలుపగా మంగోల్ డబ్లూటిపి నుంచి పంపించే ఏర్పాటు చేశారన్నారు. తాగునీరు ఎక్కడి నుంచివస్తుందో మా ప్రాంత ప్రజలకు చూపించేందుకు మంత్రి హరీశ్‌రావు సూచనతో మంగోల్ వచ్చామన్నారు.

రాష్ట్రం ఏర్పాడక ముందు 2004 ఎంపిపిగా ఢిల్లీ సమావేశానికి వెళ్లినప్పుడు రైతు ఆత్మహత్యల గురించి ఇతర రాష్ట్రాల వాళ్లు ప్రశ్నించినప్పుడు తలదించుకున్న నేను 2017లో జైపుర్‌లో కళ్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర కార్యక్రమాలు ఎలా సాధ్యమవతుఉన్నాయని ఆసక్తిగా అడిగినప్పుడు గర్వంగా అనిపించిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ గ్రామీణ భారత్‌తో అతిపెద్ద నీటి శుద్ధ్దీకరణ ప్లాంట్ ఇదేనన్నారు. ఈ పథకం అమలులో సిఎం కెసిఆర్ కృషి చాలా ఉందన్నారు. అందరూ స్పందించి దీని గురించి తెలసుకోవాలన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుగుణ దుర్గయ్య, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News