Friday, November 15, 2024

కేంద్రం ఢిల్లీలో అభినందిస్తుంటే… గల్లీలో విమర్శిస్తున్నారు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Mission bhagiratha is great scheme

హైదరాబాద్: కేంద్రం అవార్డులు మిషన్ భగీరథకు పంచాయతీ రాజ్ కు అవార్డులు ఇచ్చిందని, ఇది మా పనితనానికి నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.   మిషన్ భగీరథకు కేంద్ర పురస్కారం రావడం పట్ల పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, డైరెక్టర్ హనుమంతరావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, పలువురు అధికారులను ఎర్రబెల్లి సన్మానించారు. ఖైర‌తాబాద్ లోని రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యం లోని కాన్ఫ‌రెన్స్ హాలులో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మీడియాతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ కేంద్రం నుండి ఎన్నో అవార్డులు అందుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం అమలు చేసిన తోటి మంత్రులు అధికారులు మిషన్ భగీరథకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన డైరెక్షన్ అమలు చేసిన అధికారులు, పంచాయితీ రాజ్ సిబ్బందికి అభినందించారు. కేంద్రం 320 గ్రామాలకు 150 కి పైగా టీమ్స్ పెట్టి పర్యవేక్షించి ఈ అవార్డులు ఇచ్చారన్నారు. తెలంగాణ రాకముందు మహిళలు తాగు నీటి కోసం ఎంతో కష్టపడుతుండేవారని, తన నలబై ఏళ్ల రాజకీయంలో ఎన్నో చూశానని, మహిళలు బిందెలు పట్టుకొని ఎంతో దూరం వెళుతుండే వారని, అసెంబ్లీలో ఇదే విషయంపై చర్చలు జరుగుతుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కొరత ఉండేది ఇప్పుడు దాన్ని అధిగమించాలన్నారు. కేంద్రం ఎన్నో సార్లు రాష్ట్రాన్ని అభినందించింది పార్లమెంటులో సైతం రాష్ట్రము అభివృద్ధి ని కొనియాడారన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మాడల్ గా నిలిచిందని, జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం మన మిషన్ భగీరథను కాపీకొట్టారని, మోడీ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో 50 శాతం మాత్రమే నీరు ఇచ్చారని ఎర్ర‌బెల్లి గుర్తు చేశారు. కేంద్రం ఢిల్లీలో అభినందిస్తూ గల్లీ లో విమర్శిస్తుందని, కేంద్రము అవార్డులు ఇస్తే రాష్ట్ర నాయకులు ఫెక్ లేటర్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గాంధీ జయంతి రోజున తమకు అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని పల్లెప్రగతి అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. లాల్ బహుదూర్ శాస్త్రి, అంబేడ్కర్, గాంధీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని ఎర్ర‌బెల్లి కొనియాడారు. జై జవాన్, జై కిసాన్  రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని, ఎంతో గౌరవిస్తున్నారని, తెలంగాణలో 100 శాతం 54 లక్షల గృహాలకు తాగు నీళ్లు సరఫరా చేశామని జల్ జీవన్ శాఖ తమ ట్విట్టర్ లో, అధికారిక వెబ్ సైట్ లో పెట్టారన్నారు. లోక్ సభలో కూడా మిషన్ భగీరథపై కేంద్ర మంత్రి అభినందించారని, పొగడ్తల వర్షం కురిపించారని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ మహమ్మరిని తరిమారని,  ఫ్లోరైడ్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్ లో ప్రస్తావించారన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరును స్టడీ చేయాలని కేంద్రం అధికారులకు సూచించిందని, గల్లీలున్న బిజెపి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూన్నారని దుయ్యబట్టారు. గల్లీ బిజెపి వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నరని, తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అని తాను చాలెంజ్ చేస్తున్నానని, తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు ఎర్ర‌బెల్లి తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగ పూట ఊళ్లకు వెళితే ఒకప్పుడు ఉండే పరిస్థితి లేకుండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కరెంట్, తాగు నీటి కొరత లేదని, అందరూ పండక్కి సంతోషంగా ఊరు వెళ్తున్నారన్నారు. నరేగా పనుల మీద వందల టీమ్స్ వచ్చి అభినందనలు తెలియజేశారని, పెన్షన్స్ అందరికి అందేలా కృషి చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పల్లె ప్రగతికి కేంద్రం 350 కోట్ల నుంచి 230 కోట్లకు తగ్గించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News