Thursday, November 14, 2024

మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Vinayaka Chavithi Wishes To People

హైదరాబాద్: మిషన్ భరీరథ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అక్టోబర్ 2న ఢిల్లీలో మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని, తెలంగాణలో వందకు వంద శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరా జరుగుతోందని, రాష్ట్రంలో 54 లక్షల ఆరు వేల గృహాలకు నల్లాల ద్వారా నీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 23 వేల 890 ఆవాసాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. దేశంలో 50 శాతం గృహాలకు బిజెపి ప్రభుత్వం నల్లా నీరు ఇవ్వలేదని, ఇంటింటికి వందకు వంద శాతం నల్లాల ద్వారా నీరు ఇవ్వడంలో గుజరాత్ విఫలమైందని మండిపడ్డారు. ఢిల్లీలో కేంద్రం తెలంగాణకు అవార్డులు ఇస్తుందని, గల్లీలో బిజెపి నాయకులు అవాకులు చెవాకుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రశంసిస్తూనే గల్లీలో విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి రెండు నాల్కల ధోరణిపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.  ఇవాళ తెలంగాణ ప్రజలు గర్వించదగిన రోజు అని, తెలంగాణ పని తీరు దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ బాగుండడంతో రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసించడంతో పాటు అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తామని తెలిపిందన్నారు.

కేవలం ప్రశంసించడమే కాదని, అవార్డు ఇవ్వడమే కాదని, తెలంగాణ రాష్ట్ర పని తీరు జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఓ బూస్ట్ లా పని చేస్తుందన్నారు. మహిళల కష్టాలను తీర్చడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, మాటల్లో చెప్పడం కాదని, చేతల్లో తెలంగాణ నిరూపించిన రోజు అని హరీష్ రావు మెచ్చుకున్నారు. కేంద్రం ఓ స్వచ్చంద సంస్థ ద్వారా తెలంగాణలో 320 గ్రామాలను, 150కి పైగా టీమ్ లు పెట్టి రోజుల తరబడి పర్యవేక్షించి ఆ నివేదిక ద్వారా ఈ అవార్డులు వచ్చాయన్నారు.

రెండు రోజులకో కేంద్ర మంత్రి వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ అవార్డుతో అయినా వారికి కను విప్పు కలగాలని,  ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పని తీరు అనేక పథకాలకు ఆదర్శంగా నిలిచిందని, మిషన్ భగీరథ కార్యక్రమం హర్ ఘర జల్ కు ఆదర్శమైందని, మిషన్ భగీథను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగా అమృత్ సరోవర్ కు ఆదర్శంగా మారిందని, రైతు బంధు ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన ఏకైక సిఎం కెసిఆర్ అని, మీరు కాపీ కొట్టి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన చేపట్టారన్నారు.

104 వాహనాలు పెట్టినట్లు 1962 అనే వెటర్నరీ క్లినిక్ ను ప్రారంభించింది కెసిఆర్ అని, ఇది కేంద్రం దేశం మొత్తం అమలు చేస్తోందని, ఎన్నో కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వం దిక్సూచిగా నిలిచిందన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఏడేళ్లలో అద్భుతాలు చేసి చూపిన రాష్ట్రం, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ఏకైక నేత కెసిఆర్ అని హరీష్ రావు ప్రశంసించారు.  తాగు నీటికి శాశ్వత పరిష్కారం చూపిన నాయకుడు కెసిఆర్ ప్రశంసించారు.  చిత్తూరు జిల్లాకు 7 వేల కోట్లు కేటాయింస్తే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డిపై మేం అసెంబ్లీలో కొట్లాడామని, కాని ఒక్క రూపాయి ఇవ్వనని అసెంబ్లీలో కిరణ్ కుమారు రెడ్డి అన్నారని, కాని కెసిఆర్ కు స్వపక్ష ఎమ్మెల్యే ఉన్నా, విపక్ష ఎమ్మెల్యే ఉన్నా… ప్రతీ ఇంటికి తాగు నీరు ఇచ్చిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని, ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు.  ప్రజల ప్రశంసలు బిజెపి ప్రభుత్వం పొందాలంటే కేంద్రం నిధులు విడుదల చేయాలని, నీతి అయోగ్ కు 19 వేల కోట్లు ఇవ్వమంటే మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు 19 పైసలు ఇవ్వలేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News