Sunday, December 22, 2024

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ

- Advertisement -
- Advertisement -
  • అధికారుల నిర్లక్షంతో నీరు వృథా
  • నెలలో దాదాపు 10 సార్లు ఇదే పరిస్థితి
  • పట్టింపు లేని అధికారులు… పాలకులు

హుస్నాబాద్: మిషన్ భగీరథ పైల్‌లైన్ లీకేజీతో నీరు వృథా అవుతున్న సంబంధిత అధికారులకు, స్థానిక పాలకులకు పట్టింపు లేదని గ్రామ ప్రజలు ఆరోపించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం హుస్నాబాద్ మండలం పందిల్ల బస్‌స్టాప్ వద్ద మిషన్ భగీరథ పైల్ లైన్ లీక్ కావడంతో రోడ్డుపై తాగునీరు వృథా అవుతుందని వెల్లడించారు. భగీరధ పైప్‌లైన్ లీకేజి దాదాపు నెలలో పదిసార్లు అవుతున్న సంబంధిత అధికారులు, స్థానిక పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆరోపించారు. తక్షణమే లీకేజీ ఆరికట్టి మళ్లీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు పూర్తి జాగ్రత్తలు చేపట్టేలా స్థానిక పాలకులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News