- Advertisement -
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద ముంబయి జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా నీరు ఎగిసిపడింది. జాతీయ రహదారిపైకి శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున నీరు చేరింది. ఫలితంగా ఆ ప్రాంతంలో రాక పోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. హైద్రాబాద్, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అధికారులు వచ్చి లీకేజీని అరికట్టారు. ఫలితంగా వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. జాతీయ రహదారిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా పైపులైన్ లీకేజీ జరగడం ఉలిక్కిపాటుకు గురి చేసింది.
- Advertisement -